ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-14, అండర్ -17 బాలబాలికల కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. బుధవారం కూడా పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తలపడుతున్న బాలలు.
నల్లగొండ రూరల్, డిసెంబర్ 5 : క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని, యువత క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం రాష్ట్ర స్థాయి అండర్-14, 17 బాలబాలికల కరాటే పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలని సూచించారు.
కరాటే తో వ్యక్తిగత ధైర్యంతోపాటు శారీరక దృఢత్వం అభివ ృద్ధి చెందుతుందన్నారు. బాలబాలికలు క్రీ డా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ వాసుదేవరావు, జిల్లా కరాటే అసోసియేషన్ కార్యదర్శి దాసోజు నరసింహాచార్యులు, ఉపాధ్యా యులు రవీందర్, విమల, నాగరాజు, ధర్మేం దర్‌రెడ్డి, గఫార్, కవిత, శ్రీనివాస్‌రావు, యాదయ్య, షరీఫ్, కరాటే కోచ్‌లు పాల్గొన్నారు.