రామగిరి, జూలై 07 : నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని సెయింట్ మేరీస్ సీబీఎస్ఈ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి గోల్ షాట్ బాల్ చాంపియన్షిప్నకు ఎంపియ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీరామ్, చరణ్ ఎంపికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాసు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర అధికారిక జెర్సీని క్రీడా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా ఆవిష్కరించి, పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి (DSDO) మహమ్మద్ అక్బర్ అలీ, గోల్ షాట్ బాల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ సిస్టర్ బి.బాలా, సెక్రటరీ అక్బర్, జనరల్ సెక్రటరీ సోమశేఖర్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.