ఓయూ తెలుగు శాఖ బీఓఎస్ చైర్మన్‌గా శ్రీరామోజు రఘు
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా నల్లగొండ జిల్లా వాసి శ్రీరామోజు రఘు నియమితులయ్యారు. శ్రీరామోజు రఘు పాఠశాల స్థాయి ప్రాథమిక తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పన నుండి విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యాంశాల నిర్మాణం వరకు..
రామగిరి, ఏప్రిల్ 03 : ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా నల్లగొండ జిల్లా వాసి శ్రీరామోజు రఘు నియమితులయ్యారు. శ్రీరామోజు రఘు పాఠశాల స్థాయి ప్రాథమిక తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పన నుండి విశ్వవిద్యాలయ స్థాయి పాఠ్యాంశాల నిర్మాణం వరకు తన విశిష్ట ప్రతిభను చాటుకున్నారు. విద్యావేత్తగా, సాహిత్య సేవకుడిగా గుర్తింపు పొందిన డా. శ్రీరామోజు రఘు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం తెలుగు సాహిత్య రంగానికి గర్వకారణంగా పలువురు పేర్కొంటున్నారు. ఈ పదవిలో ఆయన మరింత సమర్థవంతంగా పనిచేసి, తెలుగు విద్యా వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేయాలని జిల్లాకు చెందిన ప్రముఖ అధ్యాపకులు, కవులు, రచయితలు, పరిశోధన విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, పరిశోధక విద్యార్థి పల్లె సతీశ్ ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

