కట్టంగూర్, జనవరి 23 : క్రీడలు యువతను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని కట్టంగూర్ మండలంలోని మునుకుంట సర్పంచ్ గుల్లి నరేశ్ అన్నారు. గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడలను సందర్శించి గ్రామ ఉన్నత పాఠశాల కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. భవిష్యత్ లో క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరడ, వందనపల్లి సర్పంచులు కొలిపాక సురేందర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.