హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో నల్లగొండ పట్టణానికి చెందిన యువకుడితో పరిచయమైంది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తన ప్రియుడిని కలుసుకోవడం కోసం ఆమె హైదరాబాద్ నుంచి నల్లగొండకు మూడేళ్ల చిన్నారిని తీసుకుని వచ్చింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు తన కొడుకు అడ్డుగా ఉన్నాడని, నల్లగొండలో బస్సు దిగి కొడుకును బస్టాండ్‌లో వదిలి ప్రియుడితో పరారైంది. బస్టాండ్‌లో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న చిన్నారిని చూసి ప్రయాణికులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ద్వారా ఆమెను వెతికి పట్టుకున్నారు. పోలీసులు మూడురోజులు కౌన్సెలింగ్ నిర్వహించి ఆమెను భర్తకు అప్పగించారు.
భర్తతో సంతోషంగా ఉంటూ ముగ్గురు పిల్లలతో కళకళలాడుతున్న పండంటి సంసారంలో సోషల్ మీడియా చిచ్చు పెట్టింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ముగ్గురు పిల్లలున్న ఓ మహిళ వారిని ఇంట్లో వదిలివెళ్లింది. భర్త ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 రోజల అనంతరం ఫోన్ ఆధారంగా అమెను గుర్తించి మూడు రోజులపాటు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ వివాహిత బజారుకెళ్తున్నానని చెప్పి పిల్లలను ఇంట్లో వదిలి రైల్వేస్టేషన్‌కు వచ్చింది. పిల్లల్ని భర్త వద్ద వదిలేసి ప్రియుడి కోసం విశాఖపట్నం వెళ్లింది. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అమె అడ్రస్సు కనుక్కొని వైజాగ్ వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నీలగిరి, నవంబర్ 5: ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా జనానికి ఎంత ఉపయోగపడుతుందో.. అంతకు రెట్టింపు స్థాయిలో అనర్థాలు తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కొంతమంది జీవితం నిలదొక్కుకునేందుకు ఉపయోగించుకుంటే మరికొంద రు జీవితాలు మంటగలిపేందుకు వినియోగించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితరాలతో బిజీగా గడుపుతూ కొంద రు కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వారు స్నేహితులుగా ఉండకుండా, వివాహేతర సంబంధాలు పెట్టుకుని, మానవత్వ విలువలు మంటగలుపుతూ కుటుంబాలకు దూరమవుతున్నారు. ప్రేమ అనే పవిత్ర భావం ఇప్పుడు అనేక కుటుంబాలను మోసగిస్తోంది. వివాహేతర సంబంధాల పేరుతో ప్రారంభమైన ఆకర్షణ రాను రాను హత్యలు, ఆత్మహత్యలు, కుటుంబాల విచ్ఛిన్నం వంటి దారుణ పరిణామాలకు దారితీయటం సమాజానికి తీవ్రమైన హెచ్చరిక. ప్రేమ పేరుతో జరిగే మోసాలు మానవత్వానికే మచ్చగా మిగులుతున్నాయి.
సామాజిక మాధ్యమాల ప్రభావం
ప్రస్తుత కాలంలో ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మాత్రమే కాదు స్నాప్ చాట్ లాంటి ప్లాట్ ఫామ్‌ల ద్వారా కొందరు వ్యక్తిగత జీవితాలను బహిర్గతం చేస్తుండటంతో కొత్త ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ వేదిక ద్వారా తాతాలిక పరిచయాలు, ఆకర్షణ, మాయమాటలకు అనేక మంది మోసపోతున్నారు. కొందరు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా బాధితులవుతున్నారు. ఇలాంటి పరిచయాలు క్రమంగా కుటుంబ బంధాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నమ్మకం చెదిరి, చిన్నారులు నిరాదరణకు గురవుతున్నారు.
సవాల్‌గా మారుతున్న తీర్పులు
2018లో ఉన్నత స్థాయి న్యాయస్థానం వివాహేతర సంబంధం నేరం కాదని తీర్పు చెప్పింది. దీంతో సహజీవనానికి చట్టబద్ధత లభించింది. దీంతో కొందరు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, కుటుంబం, పిల్లలను వదిలి, మానవతా విలువలకు తిలోదకాలిస్తున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరముందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
సోషల్ మీడియా ట్రాప్‌లో పడకూడదు
ప్రేమ అంటే హకు కాదు బాధ్యత. సోషల్ మీడియా ట్రాప్‌లో ప డి జీవితాలు నాశనం చేసుకోవద్దు. వివాహేతర సంబంధాలు చివరికి బాధాకర పరిణామాలకే దారి తీస్తాయి. ఇదే సమయంలో కొంతమంది మహిళల్లో అమ్మతనం కూడా మంటగలుస్తోంది. కుటుంబ బంధాలు, పిల్లల హకులను పకన పెట్టి తాతాలిక ఆకర్షణలకు లొంగ కూడదు. ఇలాంటి వాటివల్ల కుటుంబానికి పెద్ద నష్టం జరగుతుంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు, పిల్లలపై ప్రేమ, బాధ్యత, నైతిక విలువలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
– సైదులు , నల్గొండ టూ టౌన్ ఎస్ఐ