నీలగిరి, జూలై 20 : జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిశు గృహ సేవల పట్ల కలెక్టర్ సీ.నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని శిశుగృహ, బాలసదన్, సఖీ కేంద్రం, స్వధార్ కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది శిశువులు ఉన్నారు.. వారికి పాలు, సంరక్షణ ఏలా చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జూలై లో ఎంత మంది శిశువులు వచ్చా రు ఇప్పటి వరకు ఎంతమందిని దత్తతా ఇచ్చారనే విషయాలపై ఆరా తీశారు.
బాలసదన్‌లో నాలుగోతరగతి చదువుతున్న పూజితను తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్పించారని సిబ్బంది ఆయన దృష్టికి తేగా మంచి చదువు చెప్పించడంతో పాటు భోజనం, బట్టలు ఇప్పిస్తానని భరోసా ఇచ్చా రు. అనంతరం సఖీ కేంద్రాన్ని తనిఖీ చేసి భార్యాభర్తల తగాదాలు, ఫోక్సో కేసు లు, 181 కాల్‌సెంటర్ పనితీరును పరిశీలించారు. స్వధార్ గృహాన్ని సందర్శించి అక్కడున్న మహిళలతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకుని వారి చదువులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పారు.
నల్లగొండ సిటీ : ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించే అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో రైతుల రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులు సమారు 83వేల మంది ఉండగా.. ఇప్పటి వరకు 80వేల మంది ఖాతాల్లో మాఫీ డబ్బు జమ అయ్యిందన్నారు. మిగిలిన వారికి వివిధ కారణాల వల్ల జమ కాలేదని, వాటిని నిశితంగా పరిశీలించి సోమవారం సాయం త్రం వరకు సమర్పించాలని ఆదేశించారు.
అర్హులైన రైతులందరికీ ఈ నెలాఖరు వరకు రైతు బీమా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళా శక్తిలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ఎంటర్ప్రైజెస్ పాడి గేదెలు, క్యాంటీన్లు, బ్యాంక్ యాడ్ పౌల్ట్రీ వంటి అంశాల్లో నూటికి 150 శాతం టార్గెట్ సాధించేలా ఏపీఎంలు చర్య లు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో మాతాశిశు సంరక్షణ, ఎన్‌సీడీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి గురువారం గ్రామాలు, మున్సిపాలిటీల్లో గ్రామ, మున్సిపల్ బృందాలు ఆరోగ్య సేవలను తనిఖీ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు పూర్ణచంద్ర, శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.