నకిరేకల్ , జూన్ 19 : నకిరేకల్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ విద్యార్థిని కందికంటి శివాని, మంగళపల్లి జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి పూర్తి చేసుకున్న దోరేపల్లి బన్నీ జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కర్ర వీరారెడ్డి, పీఈటీ చైతన్యకుమార్ గురువారం తెలిపారు. ఈ నెల 4 నుండి 6 వరకు మంగళపెళ్లిలో జరిగిన 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్లో నల్లగొండ జిల్లా జట్టు తరుపున వీరు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ నెల 18 నుండి 23 వరకు బీహార్ రాష్ట్రంలోని నవాడలో జరుగుతున్న 47వ జాతీయస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్లో శివాని పాల్గొన్నట్లు తెలిపారు.
Nakrekal : జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీలకు శివాని, బన్నీ ఎంపిక