గట్టుప్పల్, ఆగస్టు 24 : గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట ఎంపీపీ పాఠశాల నుండి ఉపాధ్యాయుడు శేఖర్ ను షేరుగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపించడం పట్ల ఆందోళనకు వ్యక్తం చేస్తు ఆ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని సహకారంతో గట్టుప్పల్ ఎంఈఓ అమృతా దేవి ఉపాధ్యాయుడు శేఖర్ ను స్వార్థపూరితంగా డిప్యూటేషన్ పై బదిలీ చేయించారని ఆరోపించారు. శేఖర్ సార్ వెళ్లిన నాటి నుండి పిల్లలకు సరిగా పాఠాలు చెప్పేవారు లేక, చదువు పూర్తిగా దెబ్బతింటోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఎంఈఓ అమృతా దేవిని అడిగినందుకు వెళ్లిన తల్లిదండ్రులపై దురుసుగా మాట్లాడారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు శేఖర్ సార్ ను తిరిగి తమ పాఠశాలకు పంపించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు. వెంటనే స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక అందించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆనంద్, వి.అశోక్, రాజు, డి.మల్లేష్, ఎం.రాజు, ఈ.కృష్ణ, ఎం.వెంకటయ్య, జి.కోటయ్య, కే.తిరుపతయ్య, వి విఠల్, ఎం.కోటయ్య పాల్గొన్నారు.