రామన్నపేట, జూలై 14 : రామన్నపేటను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సుభాశ్ సెంటర్లో రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు ఆవశ్యకతపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీ లిమిటేషన్లో భాగంగా రద్దయిన రామన్నపేట నియోజకవర్గాన్ని తిరిగి పునరుద్ధరించాలన్నారు. పాతతాలుకా, పాత నియోజకవర్గ కేంద్రమైన రామన్నపేటలో ప్రజల అవసారాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయన్నారు.
పార్టీలకు అతీతంగా రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బొడ్డుపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే చాంద్, కంభంపాటి శ్రీనివాస్, వల్ల నరేందర్, పుల్లపు దుర్గయ్య, ఎర్ర రమేశ్, పోతరాజు శంకరయ్య, గంగాపురం యాదయ్య, వర్కాల గోపాల్, నోములు శంకర్, జెట్టి శివ ప్రసాద్ పాల్గొన్నారు.