సూర్యాపేట, ఆగస్టు 20 : ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్, ఓపీ ఫీజు వివరాలు, టెస్ట్‌ల చార్ట్, సి బ్బంది వివరాలతో కూడిన బోర్డులు వారం రోజు ల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రైవేటు హాస్పిటల్ యాజమానులు, డాక్టర్లతో ఆయ న సమావేశం నిర్వహించారు. దవాఖానకు సంబంధించిన అన్ని వివరాల బోర్డులను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రదర్శించాలని సూచించారు. హాస్పిటల్స్ తనిఖీ చేయటానికి ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తామని, వారం రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని తెలిపారు.
ప్రొవిజనల్ పత్రం కోసం క్షేత్ర స్థాయి పరిశీలన అవసరం లేదని, డీఎంహెచ్ఓ ద్వారా పొందవచ్చని చెప్పారు. అనుమతులు లేకుండా ఆస్పత్రి నడిపితే రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. గడువు తీరిన హాస్పిటల్ పునరుద్ధరణ కోసం అనుమతి పత్రాలు పొందేందుకు ఈ నెల 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఎంహెచ్ఓ కోటాచలం, డాక్టర్లు శ్రీకాంత్, వెంటేశ్వర్లు పాల్గొన్నారు.