తుంగతుర్తి, మార్చి 12 : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ హేయమైన చర్యకు నిదర్శనమని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని సూర్యాతండా మాజీ సర్పంచ్ యూకూ నాయక్ అన్నారు.
మండలంలోని పలువురు మాజీ సర్పంచులను పోలీసులు బుధవారం ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ఐదేళ్లు డబ్బులు పెట్టి పని చేసిన తమను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మాజీ సర్పంచులు మిట్టగాడుపుల అనుక్, శంకర్ నాయక్, వెంకన్న తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.