చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్14 : తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ర్టాన్ని సాధించి పదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దామెరలో సోమవారం చౌటుప్పల్, నారాయణపురం మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి గ్రామ నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు చేసిన అభివృద్ధి పనులతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు. నాటి ఉద్యమం నాటి నుంచి బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, చైతన్య పరచాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కాటి నిరంజన్, మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.