అర్ధాకలితో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి ఉదయం టిఫిన్ కూడా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రార్థన కంటే ముందే రాగి జావ, ఉడికించిన గుడ్డు ఇస్తుండగా.. ఇక నుంచి రోజూ ఉదయం కిచిడి, పొంగల్, ఉప్మాతో కూడిన అల్పాహారం అందించనున్నది. దీనికి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’గా నామకరణం చేసింది. మొదటప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాలలో అమలు చేయాలని నిర్ణయించగా.. ఎంపిక చేసిన బడుల్లో శుక్రవారం ప్రారంభించనున్నారు.
జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత దశల వారీగా అన్ని పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయనుండగా నల్లగొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,819 ప్రభుత్వ బడుల్లోని 2లక్షలకు పైగానిరుపేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్5(నమస్తే తెలంగాణ): ఇప్పటికే సకల సౌకర్యాలను సర్కార్ బడు ల్లో ప్రభుత్వం అమలు చేస్తుంది. తెలంగాణ ఏర్పాట్లు తర్వాత సీఎం కేసీఆర్ సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్న విషయం విధితమే. దీన్నితోపాటు ఇకా ఆయా పాఠశాలల్లో 1 నుంచి 10వతరగతి చదివే విద్యార్థులకు ఉదయం ఆల్ఫాహారం కూడా సమకూర్చడానికి సీఎం బ్రేక్పాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి దసరా సెలవుల తర్వాత ఈనెల 24న ప్రారంభించాలని తొలుత ఆలోచన చేసిన సర్కార్ శుక్రవారమే లాంఛనంగా ప్రారంభిస్తున్నది. దీనిలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లాలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ జిల్లాలోని డీఈఓ, విద్యాశాఖ వివిధ హోదా ల్లో అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్, పౌరసరఫరాల అధికారులతో ,. పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించి అంతా సిద్ధ్దం చేయాలని ఆదేశాలు జారీచేశారు.
నియోజకవర్గానికి ఒక స్కూల్లో..
నేటి నుంచి నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి సీఎం అల్పాహార పథకానికి ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల ఎంపిక పూర్తి చేశారు. వాటిల్లో జిల్లా అధికారులు పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి లోపాలు లేకుండా పథకం అమలు కోసం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని 12 పాఠశాలల్లో సీఎం అల్పాహారం పథకం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
వీటిల్లో ఈ పథకాన్ని అమలు చేస్తూ లోటుపాట్లపై దృష్టి సారించారు. వీటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 24 నుంచి అన్ని పాఠశాలల్లో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో దీనిపై గురువారం జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ప్రత్యేకంగా సమీక్ష చేశారు. శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధు లు, ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో పాటు వివిధ శాఖల అధికారులు ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.
తీరనున్న విద్యార్థుల ఆకలి కష్టం..
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఉదయం అందించే అల్పాహారం తరహల్లోనే దసరా నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అల్ఫాహారం అందుబాటులో తేనుంది సర్కార్. అయితే సర్కార్ బడికి వచ్చే విద్యార్థుల్లో 90శాతంకు పైగా పేద విద్యార్థులే ఉంటారు. వీరి ఇండ్లల్లో పొద్దున్నే టిఫిన్ తినే అలవాటు చాలా తక్కువే. తింటే పొద్దున్నే పచ్చడి మెతుకులు లేదా మళ్లీ బడిలో మధ్యాహ్న భోజనం చేసే వరకు ఖాళీ కడుపుతో ఉంటారని అంచనా. నాణ్యమైన ఆహారానికి దూ రమై విద్యార్థ్దుల శారీర, మానసిక వికాసంలోనూ తేడాలు కనిపిస్తున్నాయి. బాల్యం నుంచే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పొద్దున్నే పస్తులు ఉండకుండా ఉదయం అల్ఫాహారం అందించేలా సీఎం కేసీఆర్ చారిత్రక్మ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9గం నుంచి సాయంత్రం 5గం. వరకు విద్యార్థులు ఇబ్బంది లేకుండా సర్కార్ బడుల్లో చదువును కొనసాగించేలా ఈ పథకం తోడ్పడనుంది.
రోజువారీ మెనూ..
నల్లగొండలో ప్రారంభించే పాఠశాలలు