భూదాన్‌పోచంపల్లి, మే 9 : పోచంపల్లి ఇకత్ పరిశ్రమ బ్రాండ్ ఇమేజ్ను, చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా ప్రమోట్ చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మండల కేంద్రంలోని టూరిజం పారులో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, పోచంపల్లి మిస్ వరల్డ్ ప్రోగ్రాం ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి, డీసీపీ ఆకాంక్షయాదవ్, టూరిజం శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లపై సమీక్షించారు. పార్లోని గదులు, మ్యూజియం, హంపీ థియేటర్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాల 25 మంది సుందరీమణులు ఈనెల 15న భూదాన్‌పోచంపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ సంసృతీ, గౌరవ సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నామని, ప్రపంచ సుందరీమణులు మధురానుభూతితో, మంచి అనుభవంతో వెళ్లేలా చేయనున్నట్లు చెప్పారు. పోచంపల్లి వస్త్ర సంప్రదాయం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి ఇకత్ వస్త్రాలు ప్రాముఖ్యత గురించి ప్రచారం జరిగి వ్యాపారం, మారెటింగ్ పెరుగుతుందని, దీంతో నేతన్నలకు ఊతం కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, జిల్లా చేనేత జౌళీ శాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, క్రైమ్ డీసీపీ అరవింద్, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, సీఐ రాములు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఇన్చార్జి తాసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంపీఓ మజీద్, ఎస్ఐ భాసర్‌రెడ్డి, ఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, అధికారులు పాల్గొన్నారు.