మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ మండలం పలు గ్రామాలకు చెందిన మురళికి రూ.36 వేలు, పూల్యాకు రూ.60 వేలు, శంకర్‌కు రూ.32500, పట్టణానికి చెందిన కృష్ణకుమారికి రూ.16 వేలు, శ్రీనుకు రూ.18 వేలు, భాగ్యలక్ష్మికి రూ. 60 వేలు, గోపికి రూ.9500 చొప్పున మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉదారంగా వ్యవహరిస్తూ అనారోగ్యంతో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు సీఎం ఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఆసరా ఇస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.