దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 04 : పల్లా నరసింహారెడ్డి సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలంలోని పడమటపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ పల్లా నరసింహారెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన స్థూపానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సిరెడ్డి సేవలను స్మరించుకున్నారు. అనంతరం నరసింహారెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ టీషర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్లె ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, ఈదయ్య, యాదయ్య పాల్గొన్నారు.