నల్లగొండ సిటీ, ఏప్రిల్ 28 : తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు కొండా గణేశ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ లభించింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం అమ్మగూడెంకు చెందిన కొండ వెంకటేషం -అంజమ్మ దంపతుల కుమారుడు గణేశ్ ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఆచార్య డా.జి. విద్యాసాగర్ రావు మార్గదర్శకత్వంలో A Study On Human resource Practices of Select Hospitals in Hyderabad అనే అంశంలో చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ అవార్డు లభించింది.
గణేశ్ తెలంగాణ ఉద్యమంలో పాలమూరు యునివర్సిటీ విద్యార్థి జేఏసీ కో కన్వీనర్ గా క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ డి.ఎడ్&బి.ఎడ్ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యల సాధన కోసం పోరాటం చేశారు. 2016 నుండి బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడిగా విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తునే ఉన్నాడు. గణేశ్‌కు డాక్టరేట్ రావడం పట్ల గైడ్ డా.జి.విద్యాసాగర్ రావు, ఓయూ చీఫ్ వార్డెన్ డా.జి.శ్రీనివాస్ రావు, ప్రొ.ఖాసీం, ప్రొ.శ్రీరాములు, ప్రొ.జహంగీర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాద్యక్షుడు డా.తుంగ బాలు, కార్పోరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.