నాగారం, జనవరి 19 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని పేరబోయినగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ కడారి సత్తయ్యతో పాటు మరో 40మంది గురువారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
అనంతరం పార్టీ యూత్ మండలాధ్యక్షుడు కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి తినిపించారు. పార్టీలో చేరిన వారిలో కడారి సత్తయ్య, కడారి మహేందర్, దడిగె భిక్షం, లింగయ్య, మేకల దుర్గయ్య, పాక మల్లయ్య ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్యగౌడ్, ఎంపీటీసీ వడ్డె పరుశరాములు, ఉపాధ్యక్షులు దోమల బాలమల్లు, రాంరెడ్డి, చంద్రమౌళి, తరాల ఆంజనేయులు, జిల్లా నాయకులు ఎర్ర యాదగిరి, ఈదుల కిరణ్‌కుమార్, లింగమల్లు, ప్రశాంత్, ప్రేమయ్య, రామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.