నల్లగొండ సిటీ, జులై 04 : భూ సమస్యల పరిష్కారం, చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ యాత్ర చేపడుతున్నట్లు భూమి చట్టాల నిపుణుడు, రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు. లీప్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా శుక్రవారం కనగల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతు వేదిక, తాసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యాక్రమానికి రైతులు హజరై తమ భూ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈసందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. రైతుల కోసం 120 భూ చట్టాలు, 50 వ్యవసాయ చట్టాలు ఉన్నట్లు తెలిపారు. వాటిపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇతర దేశాల్లో రైతులు చట్టాలను వినియోగించి న్యాయస్థానాల ద్వారా నష్ట పరిహారం పొందుతారని తెలిపారు. మన దగ్గర కూడా రైతులు తమ హక్కుల కోసం చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రైతులు తెలిపిన పలు సమస్యలకు న్యాయపరంగా ఎలా పొందాలో వివరించే కరపత్రాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పద్మ పాల్గొన్నారు.
Kanagal : భూ చట్టాలపై అవగాహనకు న్యాయ యాత్ర : భూమి సునీల్