నల్లగొండ, ఏప్రిల్ 03 : టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ నకిరేకల్ విద్యార్థి సీహెచ్.నిపుణ్ (9th), s/o నాగయ్య రేణుక జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్ -17 జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు మార్చి 22 నుండి 24 వరకు హైదరాబాద్ షేక్‌పేట జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ క్లాంపెక్స్‌లో జరిగాయి. ఈ పోటీలో టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ నకిరేకల్ విద్యార్థులు సీహెచ్.నిపుణ్ 66-70 కేజీల విభాగంలో గోల్డ్ మేడల్ సాధించాడు. అలాగే బి.హరినాథ్ (9th) s/o స్వామి కళమ్మ 54-57 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. అత్యుత్తమ ప్రతిభ చూపిన సీహెచ్.నిపుణ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ నెల 05 నుండి 11 వరకు జరుగు జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది.
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కాక్షిస్తూ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ జిల్లా యువజన క్రీడా అధికారి మహమ్మద్ అక్బర్, నార్కెట్‌పల్లి ఎస్ఐ శాంతి కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ నర్సింగ్ రావు, ఎస్వీపీ శశిధర్, జేవీపీ ప్రసాద్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల పేరెంట్ కమిటీ అధ్యక్షుడు రోడ్డ నాగరాజు విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల పీడీ కొంగరి.వెంకటేశ్వర్లు, పీఈటీ కె.మహేశ్, కోచ్ శ్రీకాంత్ (షేక్‌పేట బాక్సింగ్ అకాడమీ), రవీందర్ (బాక్సింగ్, మిర్యాలగూడ) ల కృషిని ప్రశంసించారు.

జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ నకిరేకల్ విద్యార్థి నిపుణ్ ఎంపిక