నల్లగొండ రూరల్, నవంబర్ 07 : నల్లగొండ రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగ్ భట్‌లకు చెందిన ముగ్గురు విద్యార్థినులు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హ్యాండ్ బాల్ ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 4న కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ – 14 బాలికల విభాగంలో మర్రి లక్ష్మి, అండె లక్ష్మి, అండర్- 17 బాలికల విభాగంలో కానుగు హారిక ఎంపికయ్యారు. వీరు నారాయణపేట జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.మారయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మల్లీశ్వరీ, ఫిజికల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు బి.యాదయ్య, కె.రవీంద్రచారి, యాదగిరి, గోపాల్‌రెడ్డి, సైదులురావు, వేణుకుమార్, వినోద్ కుమార్, రామకృష్ణ, గ్రామస్తులు అభినందిచారు.