నల్లగొండ రూరల్, జూన్ 10 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తృతీయ బహుమతి లభించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూతురు లక్ష్మారెడ్డి, ఇమామ్ కరీం మంగళవారం తెలిపారు. పోటీల్లో ఆదిలాబాద్ జుట్టుపై 4-1 గోల్స్ తేడాతో నల్లగొండ జిల్లా జట్టు విజయం సాధించినట్లు చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు గోగుల అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఆకట్టుకుని, ఫ్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచినట్లు వెల్లడించారు. జిల్లా కోచ్‌గా రావుల మురళి, మేనేజర్‌గా హేమాద్రి, జట్టు మెంటర్‌గా కార్తీక్ వ్యవహరించినట్లు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహుమతులు ప్రదానం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా విజయం పట్ల నల్లగొండ హాకీ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.