నకిరేకల్, మే 29 : జూన్ 4 నుండి 6 వరకు నకిరేకల్ మండలం మంగళ్పెళ్లి గ్రామంలో జరిగే 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో నల్లగొండ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి కె.నర్సిరెడ్డి క్రీడాకారులకు సూచించారు. గురువారం మంగళ్పెళ్లి గ్రామంలోని హై స్కూల్ గ్రౌండ్లో మే 1 నుండి రెసిడెన్షియల్ మోడ్లో కొనసాగుతున్న బాల బాలికల హ్యాండ్ బాల్ వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు శిక్షణ సద్వినియోగం చేసుకుని హ్యాండ్బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎండీ ఉస్మాన్, లయన్స్ క్లబ్ మెంబర్ మునీందర్ రావు, నాగేందర్, ప్రభాకర్, లింగస్వామి, మహేశ్, అజయ్, అరుణ్ కుమార్, బన్నీ, వెంకటేశ్ పాల్గొన్నారు.
Nakrekal : హ్యాండ్బాల్ పోటీల్లో నల్లగొండను ప్రథమ స్థానంలో నిలుపాలి : డీవైఎస్ఓ నర్సిరెడ్డి