ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా భువనగిరిలోని గాంధీ, నెహ్రూ కెనడీ పార్కులను అభివృద్ధి చేసి ఈ నెల 14న ప్రారంభించారు.
దీంతో పట్టణ ప్రజలు కుటుంబసభ్యులతో పార్కులకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు జారుడ బల్లపై జారుతూ, ఉయ్యాలపై ఊగుతూ కేరింతలు కొడుతున్నారు. యువకుల కోసం ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు.