రామగిరి, ఏప్రిల్ 13 : కేంద్రీయ విద్యాలయ నల్లగొండలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పున్న సుధీష్ణ ఇస్రో ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ (యువికా-2026)కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు తెలిపారు. మే 10వ తేదీ నుండి హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సిలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థిని పాల్గొననుంది. యువికా ఎంపిక ప్రక్రియ విద్యాపరమైన ప్రతిభ, సైన్స్ పట్ల ఆసక్తి, శాస్త్రీయ కార్యకలాపాలలో భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో కేవలం 300-350 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికవుతారు.