చండూరు, అక్టోబర్ 27 : రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలకేంద్రంలో గురువారం బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 50 మంది టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణకు తట్టుకోలేకనే బీజేపీ ప్రభుత్వ కుట్రలు పన్నుతుందన్నారు.
టీఆర్ఎస్లో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని అన్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో చండూరు మున్సిపాలిటీలో ని బీజేపీ నుంచి ఎస్.కే ఖాసీం, ఎస్ కే సయ్యద్, కాంగ్రెస్ నుంచి ఎస్ కే చాంద్, ఎస్ కే జానీ, అవుల స్వామి, ఎస్కే చిన్న సయ్యద్, ఎస్కే నాగూర్ వలీ, చొప్పరి యాదయ్య, ఈద వెంకటేశం 50 మంది కార్యకర్తలు ఉన్నారు.