రామగిరి/నార్కట్‌పల్లి, జూలై 21 : దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు వేణు సంకోజును ఆయన నివాసంలో గురువారం సాయంత్రం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. వేణు సంకోజు సాహిత్య పటిమను ప్రభుత్వం గుర్తించి అవార్డు అందచేయడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగికార్ జవహర్లాల్, జిల్లా నాయకులు బొమ్ము శంకర్, మారుతీ ప్రకాశ్, కొండేటి నివాస్, మేక ఉమారెడ్డి, తుమ్మనగోటి వెంకట్, కటకం వెంకటచారి పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్జీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో వేణు సంకోజును కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు శాఖ అధిపతి డా॥ తండు కృష్ణకౌండిన్య, అధ్యాపకులు డా॥ వీవీ సుబ్బారావు, దీపిక, లవేందర్‌రెడ్డి, లింగస్వామి, సైదులు పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసోజు శ్రీనివాస్, పెందోట సోము, గౌవరవాధ్యక్షుడు కొండోజు కృష్ణామాచారి, నార్కట్‌పల్లి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం కార్యవర్గ సభ్యులు అద్దంకి కృష్ణాచారి, గంటోజు రమేశ్, చొల్లేటి శ్రీనివాసాచారి, గడగోజు సత్యనారాయణ, ప్రముఖ కవి కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సాహితీవేత్త మద్దోజు సుధీర్‌బాబు వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.