
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్
సీఎం దళిత సాధికారత పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఈ పథకం దళిత వర్గాల సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకాలు జరిపించారు.
ల్లగొండ, జూన్ 28 : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపిస్తూ వారి సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అబ్బగోని రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ బొర్ర సుధాకర్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ జిల్లా శంకర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, బక్క పిచ్చయ్య, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేశ్, జెర్రిపోతుల భాస్కర్, బషీర్, కొండూరు సత్యనారాయణ, రంజిత్, బకరం వెంకన్న, సంకు ధనలక్ష్మి, బాషపాక హరికృష్ణ, సంధ్య పాల్గొనానరు.
కేతేపల్లి : మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిమట వెంకన్న, సర్పంచులు బచ్చు జానకిరాములు, శ్రవణ్, నాయకులు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, వంగూరి ప్రసాద్, సైదులు, ప్రభాకర్, చేతన్ లింగయ్య పాల్గొన్నారు
కట్టంగూర్ : మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచ్‌లు సంజయ్‌కుమార్, పరుశరాములు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొల్లెద్దు యాదయ్య, శ్రీను పాల్గొన్నారు.
చిట్యాల: మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, సిలివేరు శేఖర్, జిట్ట బొందయ్య, యాదయ్య పాల్గొన్నారు.
హాలియా : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ పేర్ల సుమతి ఆధ్వర్యంలో సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీ కొండా రమేశ్, కౌన్సిలర్ అన్నెపాక శ్రీను, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి కాశయ్య, ప్రధాన కార్యదర్శి దోరేపల్లి వెంకటేశ్వర్లు, బందిలి సైదులు, రావులపాటి ఎల్లయ్య, సురేందర్ పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. నిడమనూరు మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బహునూతల నరేందర్, దళిత సంఘాల నాయకులు మడుపు వెంకటేశ్వర్లు, బైరం కృష్ణ, రవి, అవిరెండ్ల సైదులు, మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, అనంతరెడ్డి పాల్గొన్నారు.
నిడమనూరు : మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వేర్వేరుగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ బొల్లం జయమ్మ, మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెదమాం యాదయ్య, మేరెడ్డి వెంకటరమణ, దరీబు లింగప్ప, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, మెరుగు రామలింగయ్య, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు గన్నెపాక లక్ష్మణ్, కోక రాములు, బాషిపాక నాగయ్య, పెరుమాల్ల మట్టయ్య, జిల్లా సురేశ్ పాల్గొన్నారు.