
నీలగిరి, జూలై 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధిలో నంబర్‌వన్ స్థానంలో నిలబెడతానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 6, 7, 8, 9, 11, 23, 25వ వార్డుల్లో ఎల్ఆర్ఎస్ నిధుల ద్వారా మంజూరైన పనులకు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి ప్రణాళిక రూపొందించి దానికి తగ్గట్టుగా పని చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రూ.250 కోట్లతో మెడికల్ కళాశాల భవనానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వార్డుకు రూ.50 లక్షల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వార్డుకు 25లక్షలకు తగ్గకుండా ఎల్ఆర్ఎస్ నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. సాయినగర్‌లో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, కౌన్సిలర్లు మారగోని భవానీగణేశ్, మారగోని నవీన్, పర్హత్ ఫర్జానాఇబ్రహీం, ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, జెరిపోతుల భాస్కర్, కంకణాల లక్ష్మమ్మ, చిన్నాల ఆండాలు, కవ్వీ, టీపీఓ నాగిరెడ్డి, డీఈ వెంకన్న, అంగన్వాడీ టీచర్లు పుట్ట సునీత, శివలీల, స్పెషలాఫీసర్ అనిల్ పాల్గొన్నారు.