
హుజూర్నగర్, జూలై 4 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు ఉద్యమంలా జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా ఆదివారం నియోజకవర్గంలోని గ్రామాల్లో రహదారుల వెంట పిచ్చి మొక్కలను తొలగించారు. డ్రైనేజీల్లో పూడుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. పారిశుధ్య పనులు చేశారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 25వ వార్డులో కమిషనర్ నరేశ్ ప్రగతి పనులను పరిశీలించారు. హుజూర్నగర్ మండలంలోని గోపాలపురంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ పనులను పరిశీలించారు. మండలంలోని శ్రీనివాసపురంలో పిచ్చి చెట్లను తొలగించారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 2,4,13 వార్డుల్లో పనులను మున్సిపల్ చైర్మన్ జయబాబు, వైస్ చైర్పర్సన్ శ్రీలత ప్రారంభించారు. గ్రామాల్లో దారుల వెంట ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. చింతలపాలెం మండలంలో పారిశుధ్య పనులను ఎంపీడీఓ గ్యామానాయక్ పరిశీలించగా, మేళ్లచెర్వు మండలంలో ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఎంపీఓ వీరయ్య, ఎంఈఓ సైదానాయక్ పరిశీలించారు. మఠంపల్లి మండల కేంద్రంలో ప్రగతి పనులను ఎంపీడీఓ జానకిరాములు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ ఉమ పరిశీలించి మొక్కలు నాటారు. గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంలో మురుగు కాల్వలను శుభ్రం చేయగా, గరిడేపల్లి, గడ్డిపల్లిలో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేశారు. కీతవారిగూడెం, ఎల్బీనగర్, లక్ష్మీపురంలో మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఇన్చార్జి ఎంపీడీఓ వనజ, ఎంపీఓ లావణ్య పాల్గొన్నారు.
కోదాడ : పల్లె ప్రగతి కార్యక్రమాలు ఆదివారం కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా సాగాయి. కోదాడ మండలంలోని గణపవరం గ్రామంలో మొక్కలు పంపిణీ చేశారు. వీధుల వెంట బ్లీచింగ్ చల్లారు. చిలుకూరు మండలంలో డ్రైనేజీల్లో పూడిక తీశారు. వీధులను శుభ్రం చేశారు. మోతె మండలంలో రావిపహాడ్, సిరికొండ, లాల్తండాలో రోడ్ల వెంట పిచ్చి మొక్కలను తొలగించారు. పరిసరాలను శుభ్రం చేశారు. మండలంలోని విభలాపురంలో ఏర్పాటు చేసిన మెగా పల్లె ప్రకృతి వనం స్థలాన్ని డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ పరిశీలించారు. ఎంపీఓ హరిసింగ్, సర్పంచ్ చిన్న వీరస్వామి, ఈసీ శ్రీనివాస్, టీఏలు, పాల్గొన్నారు. నడిగూడెం మండలంలో పల్లె ప్రగతి వనాలను అధికారులు పరిశీలించారు. గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల వెంట పిచ్చి మొక్కలను తొలగించారు. వీధుల వెంట బ్లీచింగ్ చల్లారు. వాయిలసింగారంలో డీఎల్పీఓ శ్రీరాములు డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మునగాల మండలంలో పలు గ్రామాల్లో శానిటైజేషన్ చేశారు. మండల పరిధిలోని గణపవరంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. మాధవరంలో సర్పంచ్ విజయలక్ష్మి ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.