రామగిరి, జూలై 14 : నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హాఫీజ్ ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. హాఫీజ్ ఖాన్ 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించారు. వక్ప్‌బోర్డు చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం పీసీసీ స్పోక్స్ పర్స్‌న్‌గా పనిచేస్తున్నారు. దీంతో ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తన నియమకానికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు జిల్లా మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.