‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు గత 13 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మోడల్ స్కూల్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (MS-JAC) స్టీరింగ్ కమిటీ సభ్యుడు, PMTA-TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ డిమాండ్ చేశారు.
– PMTA-TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ డిమాండ్
– రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
– ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం
రామగిరి, అక్టోబర్ 30 : తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు గత 13 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మోడల్ స్కూల్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (MS-JAC) స్టీరింగ్ కమిటీ సభ్యుడు, PMTA-TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో MS-JAC పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, అర్హులైన టీజీటీలకు నోషనల్ సర్వీస్ వర్తింపజేసి ప్రమోషన్లు కల్పించాలని, పెండింగ్ డీఏ బకాయిలు, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని కోరారు.
ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, ఇతర ప్రయోజనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, హెచ్‌బీటీ ఉపాధ్యాయులకు నెలకు కనీసం రూ.35 వేల వేతనం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే దశలవారీ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జగదీష్ హెచ్చరించారు. ఈ నిరసనలో ఉపాధ్యాయులు రాజేందర్, రామకృష్ణ, శ్రీనివాస్, రాధిక, వజిహా తబస్సుం, శ్రీనివాస్ గౌడ్, సౌజన్య, అనిత, లూర్డురెడ్డి, విజయ్, యాదయ్య, వరలక్ష్మి, అర్ష్య బేగం, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

