మోటకొండూర్, జూన్ 17 : ప్రజలంతా దైవభక్తితో మెలగాలని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలో సోమవారం మాజీ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలతాశ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవతల పండుగలతోనే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని అన్నారు.

అనంతరం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను నిర్వాహకులు శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుదగాని హరిశంకర్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, జడ్పీటీసీ పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.