నల్లగొండ, నవంబర్ 4: నల్లగొండ నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆలోచించి మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ 20 ఏండ్లలో చేయని అభివృద్ధ్ది కోమటిరెడ్డి ఇవ్వాళ చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుక్కె డు మంచినీళ్ల కూడా అరిగోస పడ్డట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మబ్బు బాలు, విష్ణు, గూడపూరి సాయి, కొంగల సాయి, నీలం శంకర్, సాయి, నవీన్, నరేశ్ ఉన్నారు.
భూపాల్ రెడ్డి గెలుపుతో
నల్లగొండ, నవంబర్ 4: బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపుతోనే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాయకలు కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల నుంచి శనివారం బీఆర్ఎస్లో చేరగా ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చి మరోసారి మోసం ప్రయత్నం చేస్తుందని దీన్ని ప్రజలు గమనించి వారికి బుద్ధ్ది చెప్పాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే రాష్ట్రంలో సీఎం కేసీఆరే రావాలని అన్నారు. పార్టీలో చేరిన వారిలో 18వ వార్డు నుంచి నరేశ్, శ్రీను, వెంకన్న, వంశీ ఉండగా కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సందినేని జనార్దన్ రావు పాల్గొన్నారు.