నకిరేకల్, నవంబర్ 9 : నకిరేకల్ నియోజకవర్గ ప్రజలే తన బలం, కార్యకర్తలే తన బలగమని, ప్రజాఆశీర్వాదంతో నకిరేకల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో గురువారం నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన రోడ్‌షోలో కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. 24 గంటల కరెంటుతో పల్లెల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇంటికో సంక్షేమ పథకం అందుతుందన్నారు. ఇవాల్టీ ర్యాలీని చూస్తే విజయోత్సవ ర్యాలీని తలిపిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
కార్యకర్తలు ఈనెల 30న వరకు రాత్రింబవళ్లు కష్టపడి శక్తిని అంతా దారపోసి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని గడపగడపకూ వివరించి కారు గుర్తుకు ఓటువేసే విధ ంగా ఓటర్లను చైతన్యం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, షీప్ అం డ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, నల్లగొండ, యాదాద్రి జడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకుసుధాకర్, చింతల సోమన్న, శేపూరి రవీందర్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, తరాల బలరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, ప్రధాన కార్యదర్శి కేశవ్ రాజు, పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా గుడి నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నకిరేకల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు గంటన్నర సేపు కార్యకర్తలు చేసిన కోలాహలంతో బీఆర్ఎస్లో జోష్ పెరిగింది.