నార్కట్‌పల్లి / చిట్యాల, అక్టోబర్ 22 : పేదల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో పలువురు చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటానికి చెందిన 100మంది, బాజకుంట గ్రామానికి చెందిన 50మంది యూత్ కాంగ్రెస్ నాయకులు, చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన 50మంది యువజన కాంగ్రెస్ నాయకులు, కేతెపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన 50 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు. ప్రభుత్వం పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ నాయకులు బైరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.