6న చండూరుకు మంత్రి కేటీఆర్ రాక
మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలో రూ.10కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధ్ది పనులకు ఈ నెల 6న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
- చండూరు, గట్టుప్పల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు, జనవరి 4 : మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలో రూ.10కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధ్ది పనులకు ఈ నెల 6న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం దత్తతలో భాగంగా పలు అభివృద్ధ్ది పనులను ప్రారంభించినట్లు చెప్పా రు. గట్టుప్పల్‌లో రూ.1.70 లక్షలతో ఏర్పాటు చేయనున్న చేనేత క్లస్టర్, చండూరులో రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, రూ.2.5 కోట్లతో డ్రైనేజీ పనులు, రూ2 కోట్లతో సమీకృతమార్కెట్, రూ.50 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, మరో రెండు కోట్లతో మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్వహించనున్న సభాస్థలిని ఆ యన పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, రైతు సేవా సహకార సంఘం అధ్యక్షురాలు కోడి సుష్మావెంకన్న, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు దశరథ పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో ఏర్పాట్ల పరిశీలన
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లో 6న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థ్ధలాన్ని, బహిరంగ సభ ఏర్పాట్లను సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బుధవారం పరిశీలించారు. మార్కెట్ యార్డులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈఎస్ఐ దవాఖాన, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సభపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రామలింగారెడ్డి,ఆర్అండ్బీ డీఈ మహిపాల్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డీఈ స్వాతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

