నల్లగొండ: టీఆర్ఎస్ సీనియర్ నేత చిలుకల గోవర్ధన్ అకస్మాత్తుగా మరణించడం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన గోవర్ధన్.. లైన్స్ క్లబ్, వాసవి సేవా సమితి కార్యక్రమాల ద్వారా ప్రజాసమూహానికి చేరువైన నాయకుడని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా సమాజం అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారని ఆయన చెప్పారు. నిబద్ధత, నిజాయితీతో, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడుతూ నిర్మొహమాటంగా వ్యవహరించే గోవర్ధన్.. నల్లగొండ జిల్లా ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా వర్తమాన రాజకీయాలకు చిలుకల గోవర్ధన్ జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందన్నారు.