Kotha Prabhakar Reddy | అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
Kotha Prabhakar Reddy | ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
దౌల్తాబాద్ : ముత్యాలమ్మ ( Muthyalamma ) అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy) అన్నారు. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ ప్రతిష్ఠా మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుభిక్షంగా జీవించాలని కోరుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ వనజ స్వామి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, నాయకులు జనార్దన్ రెడ్డి, చింటూ, భాను, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

