దేవరకొండ రూరల్, జూన్ 06 : క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను మా అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఉచిత అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబులెన్స్ కాంటాక్ట్ నంబర్ 7780699090. ఈ కార్యక్రమంలో క్రైస్తవ జన సమితి అధ్యక్షుడు మాసారం ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.