నల్లగొండ సిటీ, జూన్ 18 : మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో వ్యక్తికి నల్లగొండ న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్ష, జరిమాన విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కనగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కోప్పోలు గ్రామానికి చెందిన చింతల నాగయ్య మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయగా కోర్టు ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది.