రామగిరి, మార్చి 8 : మహా శివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. ‘హర హర మహాదేవ శంభో శంకర’, ఓం నమ ః శివాయ నామ స్మరణలతో మార్మోగాయి. శివుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కాగా తిరుమలగిరి(సాగర్) మండలం రంగుండ్లతండాలో వెలసిన భగుడు శివుడు స్వామి వారినిఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
చెర్వుగట్టు జడల రామలింగేశ్వరాలయం, నకిరేకల్‌లో రామలింగేశ్వరాయాల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, కొండమల్లేపల్లి మండలకేంద్రంలోని సీతారామ చంద్రమౌళ్వీర ఆలయం, చందంపేట మండలం దేవరచర్ల మునిస్వామి ఆలయాల్లో ఎమ్మెల్యే బాలూనాయక్,వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరాలయంలో ఎమ్మెల్యే బీఎల్ఆర్, పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో మాజీ నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, అనుముల మండలం పేరూరు స్వయం భూసోమేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, పెద్దవూర మండల పిన్నవూరలో శివలింగానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mla Vemula Veeresham
ట్రస్మా ఆధ్వర్యంలో పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు, పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులను తరలించేందుకు 40 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సు సర్వీసును ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిపించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఏడాది శివరాత్రి వేడుకలకు ఉచిత బస్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్మా నాయకులు గట్ల అనంతరెడ్డి, యా నాల ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.