నల్లగొండ: గురువారం రాత్రి కురిసిన భారీ వానలకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నాంపల్లి మండలంలో వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయిన ఇద్దరిని స్థానికులు కాపాడారు. మండలంలోని నరసింహులగుడం వద్ద భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు బైక్‌పై వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే వాగు ప్రవాహానికి బైక్ అదుపుతప్పి అందులో పడిపోయారు. దీంతో అక్కడున్న స్థానికులు తాడు సాయంతో వారిని కాపాడారు. బైక్ నీళ్లల్లో కొట్టుకుపోయింది. ఇద్దరు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.