తుంగతుర్తి, జులై 05 : సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిపాటి సైదులు జెండాను ఎగురవేసి మాట్లాడారు. గ్రామ, మండల స్థాయిలో సంఘాల ఏర్పాటుతో వాటి పరిధిలోని బ్యాంకుల ద్వారా రుణాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ సుధాకర్, అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మోడం శ్రీలత, సొసైటీ డైరెక్టర్లు యాదగిరి, రామచంద్రు, మజీదు, భిక్షం రెడ్డి, రామనరసమ్మ, ఇదప్ప, యాకయ్య, రవీందర్ రెడ్డి సొసైటీ ఇన్చార్జి కార్యదర్శి యాదగిరి, మహేశ్, ఉమేశ్, సొసైటీ రిటైర్డ్ కార్యదర్శి వందనపు వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.