తుంగతుర్తి, మే 01 : తుంగతుర్తి లయన్స్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రిటైర్ ఉద్యోగుల భవనంలో లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వెంకటేశ్వరరావు, పాలవరపు సంతోష్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా తల్లాడ కేదారి, కార్యదర్శిగా గుండగాని రాము, కోశాధికారిగా ఓరుగంటి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని అధ్యక్షుడిగా ఎన్నికైన కేదారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గుండగాని రాము, గుజ్జ భాస్కర్, కోడి శ్రీను, వీరబోయిన రాములు, గిరి పాల్గొన్నారు.