దేవరకొండ, జూలై 24 : తెలంగాణ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, యువతకు మార్గదర్శి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిరకాలం ప్రజాసేవలో సేవ కొనసాగాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన యువ నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. కేటీఆర్ భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, దండేకర్ ప్రసాద్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, కేతావత్ రవీందర్, కేతవత్ శంకర్, రమావత్ రమేశ్, రమావాత్ తులిసీరాం, జానీబాబా, మకాం చంద్రమౌళి, రేపాని ఇద్దయ్య, పాత్లవత్ దశ్రు నాయక్, పొట్ట మురళి, పగిడిమర్రి నాగరాజు, నిరంజన్, పాత్లవత్ లక్ష్మణ్, సత్యనారాయణ, కడారి సైదులు, పొట్ట మదు, జానీ, పగిడిమర్రి సతీశ్, శిమర్ల శ్రీను, చాట్ల రాములు, మాడం రాములు, జమీర్ బాబా, వెంకటయ్య, జహంగీర్, గండూరి లక్ష్మణ్, ఆడారాపు హరికృష్ణ, కొమ్ము ఉదయ్, గుండాల వెంకట్, ఎర్ర విజయ్, వడత్య గణేశ్, జాఫర్, అశోక్, నూనె గోపాల్, జంగయ్య, శంకర్ పాల్గొన్నారు.