రామగిరి, జూలై 2 : ఉన్నత విద్యనభ్యసించే వారందరికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందు బాటులో ఉంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. చదువుకోవాలని అనుకునే వారి కోసం జిల్లాలో 1983లో నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ను ప్రారంభించారు. జిల్లాలో రెగ్యులర్ యూనివర్సిటీలతోపాటు అంబేద్కర్ యూనివర్సిటీ యూజీ(డిగ్రీ), పీజీ, పలు డిప్లొమో కోర్సుల వరకు విద్యనందిస్తుంది.అయితే 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం కాగా ఈనెల 31 చివరి వరకు గడువు ఉంది.
అడ్మిషన్లలో నల్లగొండ ఎన్జీ కళాశాల ప్రథమ స్థానం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నల్లగొండ రీజినల్ సెంటర్ పరిధిలోని ఎన్జీ కళాశాల అడ్మిషన్లలో రాష్ట్రంలోనే ముందు వరసలో ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలల ప్రాంగణంలోని బీఆర్ఏఓయూ రీజినల్ అధ్యయన కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మహిళల కోసం నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండలో చదివిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి గవర్నర్, యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ల నుంచి విద్యార్థులు బంగారు పతకాలతోపాటు సర్టిఫికెట్స్ను పొందారు.
యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు
డిగ్రీ కోర్సులు : బీఏ, బీకామ్(జనరల్, కంప్యూటర్), బీఎస్సీ, ఇతర కోర్సులు .
పీజీ కోర్సులు : ఎంబీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, బీపీఆర్ పీజీ డిప్లొమా, ఎంఎల్ఐసీ/బీఎల్ఐసీ, బీహెచ్ఎమ్, ఎంబీఏ (హెచ్సీఎం), ఎమ్మెస్సీ ఫిజికల్, కెమిస్ట్రి, బాటనీ, జువాలజీ, ఎన్విరాల్మెంట్ సైన్స్,
ఎడ్యూకేషన్ : బీఈడీ స్పెషల్ ఎడ్యూకేషన్, బీఈడీ కోర్సులను అందిస్తున్నాయి.
31వరకు ప్రవేశానికి అవకాశం ..
నల్లగొండలోని రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్లో నేరుగాని, ఆన్లైన్లో www. braouonline .inలోగాని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. డిగ్రీ కోర్సులో చేరడానికి ఇంటర్, డిప్లొమో, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, ఒకేషన్ కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అలాగే డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు పీజీలో చేరడానికి అవకాశం ఉంది. 2023- 24 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా జూలై 31వరకు చివరి గడువు ఉంది. పూర్తి వివరాలకు 9533101295, 7989339180, 9701616455లోగాని నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలోని బీఆర్ఏఓయూ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్లో సంప్రదించాలి.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి డిగ్రీ, పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించి అడ్మిషన్ పొంది జిరాక్స్ పత్రాన్ని అధ్యాయన కేంద్రంలో సమర్పించాలి. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలనే అభ్యర్థులు ఆవర్సిటీ వెబ్సైట్ అడ్మిషన్ల ఆన్లైన్లో స్టడీ సెంటర్ కోడ్ 010తో దరఖాస్తులు సమర్పించాలి.
– డాక్టర్ అంతటిశ్రీనివాసులు, రీజినల్ కోఆర్డినేటర్,నల్లగొండ
ఉమ్మడి జిల్లాలో అధ్యయన కేంద్రాలు