కట్టంగూర్, ఏప్రిల్ 10 : కట్టంగూర్ మాజీ సర్పంచ్, దివంగత కావుగంటి సోమన్న వర్ధంతిని మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామ పంచాయితీ కార్యాలయ అవరణలో ఉన్న ఆయన విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరువురు నాయకులు మాట్లాడుతూ కాపుగంటి సోమన్న గ్రామానికి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు రాంబాబు, నాయకులు మిట్టపల్లి శివ, మర్రి రాజు, గద్దపాటి దానయ్య, కొంపెల్లి యాదయ్య, రెడ్డిపల్లి వీరస్వామి, యర్కల సైదులు, ముషం ఉమేశ్, గంటెకంపు లింగయ్య, వార్డు సభ్యులు కానుగు శ్రీను, అయితగోని సైదులు, బొమ్మగాని మహేశ్, కాపుగంటి నరేశ్, పొడిచేటి శ్రీకాంత్, వెంకట్, మేడి విజయ్, రాము, గణేశ్, శివ పాల్గొన్నారు.