దేవరకొండ, మార్చి 1: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ అన్నారు. బుధవారం పట్టణంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పరీక్ష చేయించుకున్న వారికి కంటి అద్దాలు అందించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రహత్ అలీ, కమిషనర్ వెంకటయ్య, వార్డు కౌన్సిలర్ తస్కీన్ సుల్తానా, డాక్టర్ వినయ్, సూపర్ వైజర్ సఫియా, సిబ్బంది పాల్గొన్నారు.
కంటి వెలుగు దేశానికే ఆదర్శం: ఎంపీపీ
త్రిపురారం : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎంపీపీ అనుముల పాండమ్మా శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని అంజనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. నిరుపేదలంతా కంటి వెలుగు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అవిరెండ్ల వీరయ్య, ఎంపీటీసీ గజ్జెల నారాయణమ్మ, సీహెచ్ఓ తావునాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కంటివెలుగు శిబిరం ప్రారంభం
నకిరేకల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు శిబిరాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలని జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేశ్‌గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని వల్లభాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జయమ్మ, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భీమనబోయిన ప్రసాద్, మాజీ సర్పంచ్ బి. వెంకటేశ్వర్లు, నాయకులు బత్తిని రామకృష్ణ, మాద వినోద్, తిరుపారి కృష్ణ, ఎల్లస్వామి, గణేశ్, ఖాజ, లింగస్వామి పాల్గొన్నారు.