నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
నల్లగొండ పట్టణంలో బియ్యం, కిరాణా దుకాణాలు, వంట నూనెల వ్యాపార సంస్థల్లో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల అధికారులు శనివారం సంయుక్త తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీటీ సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు...
– నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై నాలుగు కేసులు నమోదు
నల్లగొండ రూరల్, అక్టోబర్ 24 : నల్లగొండ పట్టణంలో బియ్యం, కిరాణా దుకాణాలు, వంట నూనెల వ్యాపార సంస్థల్లో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల అధికారులు శనివారం సంయుక్త తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీటీ సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వ్యాపార సంస్థల్లో వినియోగిస్తున్న తూనికల పరికరాల ధృవీకరణ, ముద్రలు, తూనికలు, కొలతలకు సంబంధించిన నిబంధనలను అధికారులు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ చట్టం–2009 ప్రకారం నాలుగు కేసులు నమోదు చేశారు. ధృవీకరించిన తూనికల పరికరాలనే వ్యాపారులు వినియోగించాలని, వినియోగదారులకు సరైన తూకం అందించాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్కువ తూకం లేదా తప్పు కొలతలు గుర్తిస్తే సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని వినియోగదారులను కోరారు.

నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

